సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. వీరిద్దరి కలయికలో సినిమా. ఆ ఊహే ఎంతో భారీగా ఉంది కదూ. ఇప్పుడు ఈ ఊహే నిజమయ్యే సూచనలున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు చేసే అరవింద్ గారు ఈసారి మహేష్ బాబుతో ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు మహేష్ బాబును కలిసి చర్చలు జరిపారని, మహేష్ కూడ సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నారని వినికిడి.
మంచి కథ, దానికి సరైన దర్శకుడు ఇలా అన్నీ పక్కాగా కుదిరితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయట. మరి ఈ వార్తలకు నిజమో కాదో, ఒకవేళ నిజమైతే సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే మహేష్ లేదా అరవింద్ ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడే వరకు ఎదురుచూడాల్సిందే.
Post A Comment: