Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

వారాంతం సినీ ప్రేక్షకులకు మరింత వినోదం పంచనుంది. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద ఎక్కువ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 11 సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో తెలుగు సినిమాలు తొమ్మిది కాగా, ఒక హిందీ, ఒక ఇంగ్లిష్‌ చిత్రం ఉన్నాయి. తెలుగు సినిమాల్లో కాస్త ట్రెండింగ్‌లో ఉన్నది ‘పెళ్లి చూపులు’ చిత్ర దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇందులో అందరూ కొత్త వాళ్లే నటించారు.

దీంతో పాటు ఈ శుక్రవారం విడుదలవుతున్న మరో చిత్రం ‘యుద్ధభూమి’. మలయాళంలో మోహన్‌లాల్‌, అల్లు శిరీష్‌ కలిసి నటించిన ‘1971: బియాండ్‌ ది బోర్డర్స్‌’ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. ఇక ‘శంభో శంకర’ కూడా శుక్రవారమే విడుదల కానుంది. ఈ రెండింటితో పాటు, ‘కన్నుల్లో నీ రూపమే’, ‘నా లవ్‌ స్టోరీ’, ‘ఐపీసీ సెక్షన్‌ భార్య బంధు’, ‘సూపర్‌ స్కెచ్‌’, ‘సంజీవని’, ‘మిస్టర్‌ హోమానంద్‌’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇక ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన చిత్రం ‘సంజు’. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రణ్‌బీర్‌ కపూర్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్‌దత్‌ జీవితం ఎన్నో ఎత్తు పల్లాలతో సాగింది. అన్ని అంశాలను ఇందులో చూపిస్తారా? లేదా? తెలియాలంటే మాత్రం ‘సంజూ’ చూడాల్సిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. సంజయ్‌ పాత్రలో రణబీర్‌ ఇమిడిపోయాడంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అభిమానులు.

వీటితో పాటు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆంగ్ల చిత్రం ‘ఎస్కేప్‌ ప్లాన్‌ 2’. 2013లో విడుదలైన ఎస్కేప్‌ ప్లాన్‌కు కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి చిత్రంలో సిల్వెస్టర్‌ స్టాలోన్‌, ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ కలిసి నటించగా, సీక్వెల్‌లో స్టాలోన్‌తో పాటు డేవ్‌ బౌతిస్తా నటిస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: