వెంకటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్లందుకున్న సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ గతేడాది ‘జయదేవ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఇప్పుడీయన నీలేష్ ఎతి అనే కొత్త హీరోని లాంచ్ చేస్తూ సినిమా చేస్తూ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘నరేంద్ర’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు.
స్పోర్ట్స్ డ్రామాగా తీర్చిదిద్దనున్న ఈ సినిమా పాకిస్థాన్ నేపథ్యంలో ఉండనుంది. అందుకోసం సినిమాలో కొంత భాగాన్ని పాకిస్థాన్‌లో చిత్రీకరించాలని పరాన్జీ భావిస్తున్నారట. ఈషాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోడల్ లాజాబెల్లే హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ చిత్రానికి ‘ఢిల్లీ బెల్లీ', 'రాయీస్, 'తలాష్’ చిత్రాలకు పనిచేసిన రామ్ సంపత్ సంగీతాన్ని అందివ్వనున్నారు.
Post A Comment: