Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

సామాజిక బాధ్యతతో చిత్రాలు రూపొందించే ఆర్‌.నారాయణమూర్తి నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నదాతా సుఖీభవ’. మే 18న ఈచిత్రం విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని జులై 7న మరోసారి విడుదల చేస్తున్నామని ప్రకటించారు నారాయణమూర్తి. ఆయన మాట్లాడుతూ ‘‘రైతులే ఈ దేశానికి వెన్నెముక. వాళ్లంతా బాగుండాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోకూడదు, బతుకుపోరులో గెలవాలని చెప్పిన చిత్రమిది. చూసిన వాళ్లంతా ‘చాలా బాగుంది’ అన్నారు. పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. విజయవాడలో ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు ‘మంచి సినిమా తీశావయ్యా’ అంటూ అభినందించి, సన్మానం కూడా చేశారు. కానీ.. ఎండల వల్ల ఎక్కువ మంది థియేటర్లకు రావడానికి భయపడ్డారు. దాంతో చేరవలసినవాళ్లకు ఈ సినిమా చేరలేదు. ‘ఎండలు తగ్గాక మళ్లీ విడుదల చేయండి..’ అని రైతులు సలహా ఇచ్చారు. అందుకే జులై 7న ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: