ల్మాన్‌ ఖాన్‌ సినిమా ‘రేస్‌ 3’ సినిమాకు భారీ స్థాయిలో ప్రచారం జరిగింది. త్రీడీ యాక్షన్ సినిమాగా తెరకెక్కించడంతో మొదటివారంలో రూ.100 కోట్లు రాబడుతుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే విడుదలైన మూడు రోజుల్లో రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. కానీ కథా కథనాల పరంగా చూస్తే మాత్రం సినిమా ఫ్లాపైందనే చెప్పాలి. బోర్‌ కొట్టించే కార్‌ ఛేజింగ్‌ సన్నివేశాలు, అర్థంలేని విన్యాసాలు, డైలాగులతో ఈ సినిమాను నడిపించేశారు దర్శకుడు రెమో డిసౌజా. ‘రేస్‌ 3’ సినిమా చూసిన వారికి టార్చర్‌ తప్పదు అంటూ నెటిజన్లు సల్మాన్‌పై ఛలోక్తులు విసురుతున్నారు.

చెప్పాలంటే స్వయాన సల్మాన్‌ ఖానే ఈ సినిమా ఓ తలనొప్పిలాంటిదని పరోక్షంగా ట్వీట్‌ చేశారు. ‘ ‘రేస్‌ 3’ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూసినవారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. కష్టపడి తీసిన ఈ సినిమాను మీరు వీక్షించారు. గాడ్‌ బ్లెస్‌ యూ. ఈ సినిమా మళ్లీ మళ్లీ చూడండి అని చెప్పడం ఎక్కువే’ అని అన్నారు.
సల్మాన్‌ ట్వీట్‌ను బట్టి చూస్తే ఈ సినిమాను రెండో సారి చూడలేమని అర్థమవుతోంది. మరో విషయం ఏంటంటే.. ప్రపంచంలో అతి తక్కువ రేటింగ్స్‌ వచ్చిన సినిమాల్లో ‘రేస్‌ 3’ ఒకటి. ఐఎండీబీ(ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌) విడుదల చేసిన నివేదికలో అతి తక్కువ రేటింగ్స్‌ వచ్చిన చిత్రాల్లో ‘ఆగ్‌’, ‘హిమ్మత్‌వాలా’, ‘హమ్‌షకల్స్‌’, ‘క్యా కూల్‌ హై హమ్‌’, ‘ద్రోణా’, ‘తీస్‌ మార్‌ ఖాన్’‌ చిత్రాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు సల్మాన్‌ నటిస్తున్న ‘దబాంగ్‌ 3’ సినిమాను తీయొద్దంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: