Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

తండ్రి కమల్‌హాసన్‌లానే శ్రుతిహాసన్‌ కూడా సకల కళావల్లభురాలు. నటన, సంగీతం, పాటలు, చిత్రలేఖనం అంటూ అన్ని రంగాల్లోనూ ‘నేనూ ఉన్నా’ అనిపించుకుంటుంది. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టబోతోంది. నిర్మాతగా మారాలని ఎప్పటి నుంచో ఆశ పడుతున్న శ్రుతి, అందుకు తగిన ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసుకుంది. ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అనే చిత్రానికి శ్రుతి నిర్మాతగా వ్యవహరించబోతోంది. తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. తెలుగులోనూ విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇందులో శ్రుతి నటిస్తుందా, లేదా? అనేది మాత్రం తెలియాల్సివుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: