Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

స్టార్ హీరో సూర్య తన 37వ సినిమాను కె.వి. ఆనంద్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఆనంద్. ప్రధానంగా సూర్య పాత్ర సినిమాలో మేజర్ హైలెట్ కానుందట. ఈ పాత్ర కోసం సూర్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గెటప్స్ లో కనిపించనున్నారు. నటుడిగా మంచి పేరున్న సూర్య ఇలా నాలుగు గెటప్స్ లో వేయబోతున్నారంటే చిత్రం ఎంత భిన్నంగా ఉంటుందో ఊహించవచ్చు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే వారంలో లండన్ లో మొదలుకానుంది. ఇందులో సూర్యకు జోడీగా సాయేషా సైగల్ నటించనుంది.

హిందీ నటుడు బోమన్ ఇరానీతో పాటు అల్లు శిరీష్, సముతిర ఖని వంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు చేయనున్న ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. గతంలో కెవి ఆనంద్ సూర్యతో ‘బ్రదర్స్', 'వీడొక్కటే’ వంటి ఆసక్తికరమైన చిత్రాల్ని రూపొందించి ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: