నృత్య దర్శకుడు రాబర్ట్ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్న తమిళ చిత్రం ‘ఒండిక్కు ఒండి’. జేఎం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీకాంత్ దేవా సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. నటుడు విజయ్ సేతుపతి ముఖ్య అతిథిగా హాజరై పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాబర్ట్ మాస్టర్ మంచి మిత్రుడు. నేను పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచే ఆయన తెలుసు. అందరికీ సహకరించే మనస్తత్వం ఆయనది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని’ పేర్కొన్నారు.
‘త్రిష, నయనతారతో కలిసి నటించారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు?’.. అని అడిగిన ప్రశ్నకు విజయ్ సేతుపతి ‘మహిళలను అలా విభజించి చూడలేం. ఎందుకంటే.. స్త్రీలంతా అందంగా ఉన్నవారే’ అంటూ నవ్వుతూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘విజయ్‌సేతుపతి- త్రిష, విజయ్‌సేతుపతి - నయనతార.. వీరిలో ఏ జంట తెరపై చూడముచ్చటగా ఉంటుందని నమ్ముతున్నారు’ అనే ప్రశ్నకు.. నాకు తెలిసినంత వరకు నటుల జంటలను చూడకూడదు. తెరపై వారు పోషించిన పాత్రలను బట్టే వారి కెమిస్ట్రీని నిర్ణయించాలని పేర్కొన్నారు.
ఇప్పటికే నయనతారతో ‘నానుం రౌడీదాన్’ చిత్రంలో నటించిన విజయ్.. తాజాగా త్రిషతో ‘96’ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా తెరపైకి రానుంది.
Post A Comment: