హాలీవుడ్ ప్రముఖ‌ నిర్మాణ సంస్థలు వార్నర్‌ బ్రదర్స్‌, లెజెండరీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ‘గాడ్జిల్లా’ (2014) సినిమా బాక్సాఫీసు వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.‌ 160 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.వెయ్యి కోట్లు)తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 529.1 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3637 కోట్లు) వసూలు చేసి కాసుల వర్షం కురిపించింది.

ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తోన్న సినిమా ‘గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్‌స్టర్స్‌’. గాడ్జిల్లా ఫ్రాంచైస్‌‌లో 35వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రానికి మైఖెల్‌ డోగర్టి దర్శకత్వం వహిస్తున్నారు. కైరా చాండ్లర్‌, వెరా ఫార్మిగా, మిల్లీ బాబీ బ్రౌన్‌, బ్రాడ్లీ విట్‌ఫోర్డ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 31న విడుదల కాబోతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌-1ను విడుదల చేశారు. ఇది యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల్లోనే 53 లక్షల వ్యూస్‌ను దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘మన ప్రపంచం మారిపోయింది. భూమి అంతరించిపోతుందని మేం భయపడుతున్నాం. ఇప్పటికే అది ప్రారంభమైంది. దానికి మేమే కారణం.. మేమే ఆ ఇన్ఫెక్షన్..’ అనే మాటలతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌లో గాడ్జిల్లా భారీగా, అతి భీకరంగా కనిపించింది.‌

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: