కోలీవుడ్‌లో కొంత కాలంగా ఆడియో విడుదల కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. టాలీవుడ్‌లో లాగా.. మైదానాల్లో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ‘కాలా’ ఆడియో విడుదల కార్యక్రమం సూపర్‌స్టార్ అభిమానులకు ఓ పండుగలా అనిపించింది. త్వరలోనే నటుడు శివకార్తికేయన్ కూడా మదురైలో పెద్ద ఎత్తున ఆడియో వేడుక నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా ‘ఇలయ తలబది’ విజయ్ నటించిన ‘సర్కార్’ ఆడియో విడుదలను నెహ్రూ ఇండోర్ స్టేడియం లేదా ఇతర మైదానంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. మురుగదాస్, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో సినిమా డబ్బింగ్ పనులు తాజాగా ఆరంభమయ్యాయి.
దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెప్టెంబరులో ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది. అందులో భాగంగా ఆస్కార్ వీరుడు ఏఆర్ రెహమాన్ సంగీత విభావరిని ఏర్పాటుచేసినట్లు సమాచారం.
Post A Comment: