రాక్షస బల్లుల నేపథ్యంలో స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన ‘జురాసిక్ పార్క్’ను సినీ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. దీని సీక్వెల్‌గా 2015లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రం ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్’ కూడా ప్రపంచ బాక్సాఫీసు వద్ద విజయ దుందుభి మోగించింది. జూన్ 8న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1 బిలియన్ డాలర్లు (రూ.6800 కోట్లు) రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. ఈ మైలురాయిని చేరుకున్న 35వ చిత్రంగా నిలిచింది. 170 మిలియన్ డాలర్లతో (రూ.1000 కోట్లకుపైగా) రూపొందించిన ఈ సినిమా యునైటెడ్ స్టేట్స్‌లో 304.8 మిలియన్ డాలర్లు, విదేశాల్లో 700.7 మిలియన్ డాలర్లు రాబట్టినట్లు యూనిట్ పేర్కొంది.
డైనోసార్లు జీవిస్తున్న ఓ దీవిలోని అగ్ని పర్వతం బద్దలౌతుందని తెలిసి వాటిని కాపాడేందుకు ఓ బృందం ప్రయత్నిస్తుంది. ఈ కాపాడే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. క్రిస్ ప్రాట్, బ్రిస్ డల్లాస్ హొవార్డ్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఏజే బయోనా దర్శకత్వం వహించారు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు.
Post A Comment: