కథానాయిక లావణ్య త్రిపాఠి బాలీవుడ్ వైపు దృష్టి పెడుతున్నారని.. అందుకే దక్షిణాది సినిమాలను ఒప్పుకోవడం లేదని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలే ‘ఇంటిలిజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య ప్రస్తుతం ‘ముద్ర’ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ వైపు వెళ్లేందుకు ఆమె తెలుగు, తమిళ సినిమాలను నెమ్మదిగా తగ్గించేస్తున్నారని పలు ఆంగ్ల మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అదీకాకుండా ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్‌ల చిత్రీకరణ త్వరగా పూర్తిచేసుకుని బాలీవుడ్ సినిమాకు సంతకం చేయాలని అనుకుంటున్నారని, అందుకోసం భారీగా కాల్‌షీట్లు కేటాయిస్తున్నట్లు రాశాయి.
దీంతో తన సినిమాల విషయంలో లావణ్య తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం బాలీవుడ్ వైపే మొగ్గు చూపడం లేదని.. అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన గురించి ఓ ఆంగ్ల మీడియా రాసిన వార్తను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘నాకు అన్ని ఇండస్ట్రీల్లో పనిచేయాలని ఉంది. కేవలం బాలీవుడ్ పైనే దృష్టిపెడతానని నేనెప్పుడూ చెప్పలేదు’ అని వెల్లడించారు.
Post A Comment: