Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

ప్పుడు బయోపిక్‌ల సీజన్ నడుస్తున్నట్లుంది. బయోపిక్‌లు మంచి విజయాలు సాధిస్తుండడంతో అలాంటి చిత్రాలు మరిన్ని రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు ఆ వరసలో మరో బయోపిక్ శ్రీకారం చుట్టుకుంది. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌. అలాంటి గొప్ప దర్శకుని జీవితం ‘విశ్వదర్శనం’ పేరుతో వెండితెరపైకి రానుంది. ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అనేది ఉపశీర్షిక. జనార్థన మహర్షి దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వర వీణాపాణి బాణీలు అందిస్తున్నారు.

గురుపూర్ణిమ సందర్భంగా శుక్రవారం (27 జూలై 2018) ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో కె. విశ్వనాథ్‌ దంపతులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, టి.జి విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల సినిమా స్క్రిప్ట్‌ని జనార్థన మహర్షికి అందించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ దంపతులను చిత్ర బృందం సత్కరించింది.

ఈ కళాతపస్వి జీవిత చరిత్ర పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని, ఇలాంటి వ్యక్తి చరిత్రను చూపించాలనే ఆకాంక్షతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. విశ్వనాథ్‌ పుట్టుక నుంచి ఇప్పటివరకూ వివిధ దశలలో ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిపింది. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని చెప్పింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఆరేళ్ల క్రితం జనార్థన మహర్షి దర్శకత్వంలో రూపొందిన ‘దేవస్థానం’ చిత్రంలో విశ్వనాథ్‌ ముఖ్య పాత్రలో కనిపించారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: