సంవత్సరం క్రితం వచ్చిన ‘ఇరుది సుట్రు’ సాధించిన విజయాన్ని ఏడాది పాటు ఆస్వాదించిన నటుడు మాధవన్.. ప్రస్తుతం పలు హిందీ, తెలుగు, తమిళ చిత్రాలకు సంతకాలు చేశారు. తాజాగా శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌లో ఇస్రో శాస్త్రవేత్తగా నటించనున్నట్లు సమాచారం. అనంత మహదేవన్ దర్శకత్వంలో వస్తున్న నంబి నారాయణన్ బయోపిక్‌లో ఆ పాత్రకు ఎవరు న్యాయం చేయగలరని అనేక మంది పేర్లను పరిశీలించి చివరకు మాధవన్‌ను ఎంచుకున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు.
ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రంలో ముఖ్యంగా నంబి నారాయణన్ జీవితంలోని మూడు ప్రధాన ఘట్టాలను దర్శకుడు తెరపై ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా మాధవన్ ఈ చిత్రంలో మూడు రకాలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆఖరులో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ సెట్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన కథ, సంగీతం, ఇతర తారాగణం వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Post A Comment: