మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో.. రమ్యకృష్ణ కుర్చీలో కూర్చుని పక్కనే అను ఇమ్మాన్యుయేల్‌తో నిలబడి ఉన్న నాగచైతన్యను కోపంగా చూస్తుండడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. మరో పోస్టర్‌లో డీసెంట్‌గా ఉన్న నాగచైతన్య లుక్ బాగుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు’ పాటను రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ పాటలో తమన్నా నర్తించనున్నారు. నాగచైతన్య ఈ సినిమాతో పాటు చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.
Post A Comment: