పెళ్లయ్యాక నాగచైతన్య, సమంతలు కలిసి ఎప్పుడు నటిస్తారా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వారి ఆశ నెరవేరింది. యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫెమ్ శివ నిర్వాణ తెరకెక్కించనున్నచిత్రం ఈ రోజు పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సమంతతో పాటు నాగార్జున కూడా వచ్చారు. ఈరోజు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి కానీ ఆగస్ట్ నుంచి చిత్రీకరణ మొదలు కానుందని సమంత వెల్లడించారు.
ఇందులో చైతు, సమంతలు భార్యాభర్తల పాత్రల్లోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ’ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాల తరువాత చైతు, సమంత కలిసి నటిస్తున్నారు. వినోదాత్మక ప్రేమకథా చిత్రంగా దీనిని తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సాహి గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
మరోపక్క చైతూ ‘సవ్యసాచి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. సమంత ‘యూటర్న్’ చిత్రంలో నటిస్తున్నారు. ఆదివారం ‘యూటర్న్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
Post A Comment: