కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో కథానాయిక స్థాయిని మించిన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు నయనతార. హీరోలకు సమానమైన పాత్రలను పోషించడం ఆరంభించిన ఈమె.. తనకంటూ ప్రత్యేక ట్రెండ్‌ను సృష్టించుకున్నారు. ‘మాయా’, ‘అరం’.. వంటి చిత్రాల తర్వాత ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోలమావు కోకిల’. ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
అయితే అదే రోజున ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘విశ్వరూపం 2’ను విడుదల చేయనున్నట్లు ఇటీవల కమల్‌హాసన్ ప్రకటించారు. ‘తూంగావనం’ తర్వాత దాదాపు రెండు సంవత్సరాల అనంతరం కమల్ సినిమా వస్తోంది. అయినప్పటికీ ఈ లేడీ సూపర్‌స్టార్ తన సినిమాను విడుదల చేయడానికి ఏ మాత్రం వెనకాడటం లేదని కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. మరి నయన్ చిత్రం ఎలాంటి ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.
నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చారు. నయనతార, జాక్లిన్, యోగిబాబు, శరణ్య పొన్‌వన్నన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
Post A Comment: