కన్నడ చిత్రసీమలో 1973లో విడుదలై సంచలన విజయం సాధించిన 'నాగరహావు' సినిమా ఆధునిక సాంకేతికత సొబగులద్దుకొని దాదాపు 45ఏళ్ల తర్వాత శుక్రవారం మరోమారు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై వీరాస్వామి నిర్మించిన ఈ సినిమాకు పుట్టణ్ణ కణగాల్ దర్శకత్వం వహించారు. 'నాగరహావు' సినిమా ద్వారా విష్ణువర్ధన్, అంబరీష్ వెండితెరకు పరిచయం కావడంతో పాటు ఒకరు కథానాయకుడుగా, మరొకరు ప్రతినాయకుడుగా కన్నడ చిత్రసీమలో తమదైన ప్రత్యేతస్థానాల్ని సంపాదించుకున్నారు.
అనేక భాషల్లో సినిమాలకు స్ఫూర్తినిచ్చిన నాగరహావు సినిమాలోని ‘హావిన ద్వేష హన్నెరడు వరుష...’ పాట ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇందులో అశ్వత్థ్ నటించిన ఉపాధ్యాయుడి పాత్ర గురించి ఇప్పటికీ చెప్పుకుంటుంటారంటే ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. 'నాగరహావు' తరవాత అశ్వత్థ్‌కు మేష్ట్రు అనే పేరు నిలిచిపోయింది. చిత్రదుర్గ కోటను, కోట రక్షణకు ఒనకే ఓబవ్వ చూపిన సాహసాన్ని తెలుసుకోవడం ద్వారా దేశభక్తిని పెంపొందించుకోవచ్చు. జయంతి పేరు వినగానే ఒనకే ఓబవ్వ పాత్ర గుర్తుకొస్తుంది.
అప్పట్లో ఈ సినిమా విడుదల తరువాత చిత్రదుర్గ కోట ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిందని చెబుతారు.ఆధునిక హంగులతో క్రేజీస్టార్ రవిచంద్రన్ సోదరుడు బాలాజీ ఈ సినిమాను తిరిగి విడుదల చేస్తున్నారు.
Post A Comment: