భారీ డిమాండ్ ఉన్న కథానాయకులు సినిమా లాభాల్లో వాటా తీసుకుంటుంటారు. కానీ సాధారణంగా కథానాయికలు మాత్రం నటించినందుకు పారితోషికం తీసుకుని సరిపెట్టుకుంటారు. ఇందుకు భిన్నంగా తొలిసారి ‘పద్మావత్’ సినిమా కోసం దీపికా పదుకొణె లాభాల్లో వాటా కోరినట్లు తెలిసింది. అయితే పారితోషికం గురించి దీపికను ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు దీపిక బాటలో ప్రియాంక కూడా నడుస్తున్నట్లు సమాచారం.
గత కొన్నేళ్లుగా హాలీవుడ్‌లో బిజీగా గడిపిన ప్రియాంక కొన్ని రోజుల క్రితం బాలీవుడ్‌లో పలు సినిమాలకు సంతకం చేశారు. అందులో సోనాలీ బోస్ దర్శకత్వం వహిస్తున్న ‘ది స్కై ఈజ్ పింక్’ ఒకటి. ఈ సినిమాలో నటించేందుకు ప్రియాంక చోప్రా తన సాధారణ పారితోషికం కాకుండా నిర్మాతలను షేర్ అడిగినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఒప్పందం ప్రకారమే ఆమె సినిమాకు సంతకం చేసినట్లు చెబుతున్నారు.
ఈ చిత్రంలో ప్రియాంక.. నటి జైరా వాసీమ్ తల్లి పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంకకు జోడీగా అభిషేక్ బచ్చన్‌ను పేరును పరిశీలించారు. కానీ ఆయన చివర్లో ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలోకి ఫర్హాన్ అక్తర్ వచ్చారు.
Post A Comment: