సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం ‘రోబో’కి కొనసాగింపుగా ‘2.0’ చిత్రం తెరకెక్కుతోంది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు దర్శకుడు శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ‘‘విఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు ఎప్పటికి పూర్తి చేయగలరో ఆ కంపెనీలు తెలియజేశాయి. అందుకే నవంబరు 29న ‘2.ఓ’ ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది’’ అని ట్వీటారు శంకర్.
Hi everyone.. atlast the vfx companies promised the final delivery date of the vfx shots. The movie will release on nov 29th 2018.#2Point0 pic.twitter.com/ArAuo5KxM7— Shankar Shanmugham (@shankarshanmugh) July 10, 2018
Post A Comment: