త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే...’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ప్రకాష్‌రాజ్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. కొంత టాకీభాగం, పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబరు 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
‘‘సున్నితమైన ప్రేమకథా చిత్రమిది. అందమైన జంట నేపథ్యంలో ఆద్యంతం సరదాగా సాగుతుందీ చిత్రం. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ వంటి చిత్రాలతో విజయాలందుకొన్న దర్శకుడు త్రినాథరావు నక్కిన... మంచి అభిరుచి ఉన్న నిర్మాత దిల్‌రాజు కలిసి చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకొంటుందీ చిత్రం’’ అని చిత్రవర్గాలు తెలియచేసాయి.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: విజయ్ కె.చక్రవర్తి, కళ: సాహి సురేష్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, మాటలు: బెజవాడ ప్రసన్నకుమార్, రచనా సహకారం: సాయికృష్ణ.
Post A Comment: