Malayalam Movie News | Latest Malayalam Cinema News | Mollywood Film News | Mollywood News | All Cinema News | Cinerangam.com

కప్పుడు మళయాళంలో షకీలా చిత్రం వస్తుందంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆమె చిత్రాలకు పోటీగా తమ చిత్రాలను విడుదల చేసేవారు కాదు. అలాంటి షకీలా జీవిత కథ ఇప్పుడు సినిమాగా రాబోతుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం షకీలా బయోపిక్ ను మలయాళంలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా.. సినీరంగంలోకి ఎలా వచ్చారు ? శృంగార తారగా ఎలా మారారు ? సినీరంగంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ? ఎంతమంది ఆమెను మోసం చేశారు ? ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె బయోపిక్ లో చూపించనున్నారట.

కాగా షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా కనుపించనుంది. ఈ చిత్రం కోసమే రిచా చద్దా ప్రత్యేకంగా మ‌ల‌యాళం నేర్చుకొన్నే పనిలో ఉంది. అదేవిధంగా ష‌కీలాతో మాట్లాడి ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకుంటోందట. హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కానుంది.

ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా పోషిస్తున్నారు. అలాగే ఆమె ప్రధాన పాత్రగా త్వరలో 'శీలవతి' చిత్రం విడుదల కానుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: