నవరస కథానాయకుడు కమల్‌హాసన్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం ‘భారతీయడు 2’. శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయం నిజమేనని కమల్ స్వయంగా చెప్పారు. అజయ్ ఈ సినిమాలో నటిస్తున్నారా? అని అడగగా.. ‘అవును నాకూ తెలిసింది. ఇది దర్శకుడి నిర్ణయం’ అని ఆయన అన్నారు.
ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ సెట్‌ను ఏర్పాటు చేశారట. ఇందులో కమల్‌కు జోడీగా నయనతార నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై చిత్ర బృందం స్పష్టత ఇవ్వలేదు. అనిరుధ్ సినిమాకు బాణీలు అందించనున్నట్లు తెలిసింది. తొలుత ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని దిల్‌రాజు తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలిసింది.
కమల్ ప్రస్తుతం తన సినిమా ‘విశ్వరూపం 2’ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 10న ఈ సినిమా విడుదల కాబోతోంది.
Post A Comment: