Hindi Movie News | Latest Hindi Cinema News | Bollywood Film News | Bollywood News | All Cinema News | Cinerangam.com

బాలీవుడ్‌ దర్శకుడు రీమా కట్గి దర్శకత్వం వహిస్తూ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గోల్డ్’. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సాధించిన తొలి స్వర్ణపతకం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు కొత్తగా ఐమ్యాక్స్‌ ట్రైలర్‌ పేరిట మరో ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసారు.

ఈ చిత్రంలో అక్షయ్‌.. తపన్‌ దాస్‌ అనే హాకీ టీం అసిస్టెంట్‌ మేనేజర్‌ పాత్రలో నటిస్తున్నారు. దేశం తరఫున హాకీ క్రీడలో ఆడాలన్నది అతని కల. ‘భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోతోంది. ఆ తర్వాత మనం భారత్‌ను ఒలింపిక్స్‌కు తీసుకువెళ్లాలి’ అని అక్షయ్‌ చెబుతోన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. హాకీ జట్టులోని సభ్యులు గొడవపడటం చూసి... ‘మన దేశానికి స్వేచ్ఛ లభించింది. మనలో మనం కొట్టుకుంటే బయటి వారు వచ్చి మనల్ని ఓడిస్తారు. జట్టులో ఐకమత్యం లేకపోతే ఎప్పటికీ గెలవలేం’ అంటోన్న డైలాగ్‌ కూడా ఆకట్టుకుంది. భారతీయుల గొప్పతనం గురించి మాట్లాడుతూ.. ‘రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, మీకున్న పొగరు, అహంకారం చూసుకుంటూ బతికేయండి. మేం మాత్రం మా భారతదేశాన్ని చూసుకుంటాం’ అన్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

మౌనీ రాయ్‌, కునాల్‌ కపూర్‌, అమిత్‌ సాధ్‌, వినీత్‌ సింగ్‌, సన్నీ కౌశల్‌, నిఖితా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రితేశ్‌ సిధ్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: