మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’. సోమవారం (27 ఆగస్ట్ 2018) సాయంత్రం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చాలా విభిన్నంగా ఈ ప్రచార చిత్రం ఉంది. A అక్షరంతో ఉన్న మూడు పేకాట ముక్కలు.. అందులో రవితేజ కనిపించారు. ఆయన ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. పోస్టర్‌ను బట్టి రవితేజ ఈ చిత్రంలో హిందువు, ముస్లిం, క్రిస్టియన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆసక్తికరంగా రూపొందించిన ఈ ఫస్ట్‌లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. అంతకుముందు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది.
చాలా కాలం తర్వాత ఇలియానా ఈ సినిమాతో కథానాయికగా మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. సునీల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు తమన్ బాణీలు అందిస్తున్నారు. అక్టోబరు 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ, శీనువైట్ల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు విజయం సాధించడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
కాగా ‘నేల టిక్కెట్’ తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా ఇది. మరోపక్క ఆయన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ కథానాయకుడిగా నటిస్తున్నారు. కాజల్, కేథరిన్ కథానాయికలు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దీని తర్వాత రవితేజ వి.ఐ ఆనంద్ ప్రాజెక్టులో నటించనున్నారట.

Post A Comment: