Tamil Movie Gossips | Latest Tamil Cinema Gossips | Kollywood Film Gossips | Kollywood Gossips | All Cinema Gossips | Cinerangam.com

థానాయిక అనుష్క ‘భాగమతి’ తర్వాతి ప్రాజెక్టుకు సంతకం చేసారని చెబుతున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. శింబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సినిమా ‘వీటీవీ 2’ (‘వీన్నైతాండి వరువాయా’- తెలుగులో ‘ఏమాయ చేసావె’) సినిమాలో శింబు ప్రేయసిగా అనుష్క కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. శింబు, అనుష్క జంటకు కూడా మంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరు గతంలో ‘వానమ్‌’ సినిమాలో నటించారు. అనుష్క తన అభిమాన నటి అని శింబు ఇటీవల ఓ అవార్డుల వేడుకలో కూడా అన్నారు. ఈ సీక్వెల్‌కు అనుష్క అయితే సరిపోతారని యూనిట్‌ భావించినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుందని చెబుతున్నారు.

ఈ చిత్రానికి గౌతమ్‌ మీనన్‌ దర్శకుడు. ఈ ప్రాజెక్టు గురించి శింబు, గౌతమ్‌ ఇటీవల మీడియా ముందు మాట్లాడారు. అయితే సినిమాను ప్రారంభించబోతున్నట్లు అధికారిక ప్రకటన రాలేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా వెల్లడించలేదు. ‘వీటీవీ’లో శింబు, త్రిష జంటగా నటించారు. ఈ సినిమా చక్కటి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తోన్న సినిమా ఇది. తెలుగు ‘ఏమాయ చేసావె’ సినిమాలో నాగచైతన్య, సమంత జంటగా నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: