హాలీవుడ్‌లో హారర్ కామెడీ జోనర్‌లో 2015లో విడుదలైన చిత్రం ‘గూస్ బంప్స్’. రాబ్ లెటర్‌మ్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గూస్‌బంప్స్2: హాంటెడ్ హాలోవీన్’ సినిమా రాబోతోంది. తాజాగా చిత్ర బృందం కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. కొంచెం హాస్యం.. ఇంకొంచెం ఉత్కంఠ కలగలిపిన ట్రైలర్ చూస్తుంటే తొలి చిత్రానికి దీటుగా సీక్వెల్‌ను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.
ఒక చిన్న పట్టణంలో హాలోవీన్ రాత్రి సమయంలో సోనీ, శామ్ అనే ఇద్దరు బాలురు పాడుబడిన ఒక ఇంటిలోకి వెళ్తారు. అక్కడ పెట్టెలో కనిపించిన ఒక పుస్తకాన్ని చూస్తారు. దాన్ని తెరవడంతో చిత్ర, విచిత్ర రూపాలు బయటకు వస్తాయి. మరి వాటి బారి నుంచి ఆ ఇద్దరు పిల్లలు ఎలా తప్పించుకున్నారు. చివరకు ఏమైంది అనేదే కథ!
తాజా చిత్రానికి అరి శాండిల్ దర్శకత్వం వహిస్తుండగా, వెండి మెక్‌లెండన్, మాడిసన్, జెరీమీ రే టేలర్, కలీల్ హ్యారిస్, క్రిస్ పార్నెల్, కెన్ జియాంగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Post A Comment: