అడివి శేష్ కథానాయకుడిగా నటించిన ‘గూఢచారి’ సినిమా అమెరికాలో విశేషమైన వసూళ్లు రాబడుతోంది. శోభిత ధూళిపాళ్ల కథానాయికగా, ప్రకాశ్‌రాజ్, సుప్రియ, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ టిక్కా దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శుక్రవారం (ఆగస్టు 3) విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. సినిమా హాలీవుడ్ తరహాలో ఉందని విమర్శకులు, ప్రముఖులు మెచ్చుకున్నారు.
అయితే ఈ చిత్రం విదేశాల్లో తన సత్తా చాటిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సినిమా వసూళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. ఈ చిత్రం రెండు రోజుల్లో అమెరికా బాక్సాఫీసు వద్ద రూ.2.14 కోట్లు రాబట్టినట్లు తెలిపారు. సినిమా గురువారం నిర్వహించిన ప్రీమియర్‌లో 52,394 డాలర్లు, శుక్రవారం 102,994 డాలర్లు, శనివారం 156,009 డాలర్లు మొత్తం 311,397 డాలర్లు (రూ.2.14 కోట్లు) రాబట్టినట్లు చెప్పారు.
ఈ వసూళ్లు కేవలం అమెరికాలోని 112 లొకేషన్లకు సంబంధించినవని మాత్రమేనని తరణ్ పేర్కొన్నారు. ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ ప్రభావమిదని అభిప్రాయపడ్డారు. శుక్రవారంతో పోలిస్తే, శనివారం వసూళ్లు 51.47 శాతం పెరిగాయని ఆయన చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
కాగా మూడవ రోజు అయిన ఆదివారం నాడు కృష్ణ జిల్లాలో గూఢచారి 13,27,058 రూపాయల విలువైన షేర్ ను కలెక్ట్ చేయగా ఈ చిత్రం మొదటి వారాంతపు షేర్ విలువ 29.59 లక్షలకు చేరుకుంది.
Post A Comment: