Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కథానాయకుడు రానా సమర్పిస్తున్న ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రం తనను ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని అన్నారు నేచురల్‌ స్టార్‌ నాని. అందరూ నూతన నటీనటులే నటించిన ఈ సినిమాకు వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించారు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా ఇది. కాగా..ఈ సినిమాను నాని వీక్షించారట. సినిమాపై తన తన అభిప్రాయాన్ని ట్విటర్‌ వేదికగా వ్యక్తం చేశారు. ‘ 'కేరాఫ్‌ కంచరపాలెం' సినిమా ఓ మ్యాజిక్. నన్ను నవ్వించింది, ఏడిపించింది. నా హృదయాన్ని తాకింది. చాలా కాలం తర్వాత నాకు నచ్చిన చిత్రమిది. దయచేసి ఈ సినిమాను ఎవ్వరూ మిస్‌ కాకండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే ఈ సినిమాను ఉద్దేశించి దర్శకులు క్రిష్‌, సుకుమార్‌ మాట్లాడారు. సినిమా తమను మరో చోటుకు తీసుకెళ్లిందని మెచ్చుకున్నారు. దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి కూడా ఇంత చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందుకు చిత్రబృందాన్ని ప్రశంసించారు.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: