Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

హిట్ చిత్రం ‘ఆర్‌ఎక్స్‌100’ తో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌. ‘సప్నో సే భరే నైనా’ అనే హిందీ ధారావాహికతో బుల్లితెరకు పరిచయమయ్యారు పాయల్‌. 2017లో ‘చన్నా మేరేయా’ అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా అవకాశం దక్కించుకున్నారు. మరాఠీలో బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచిన ‘సైరాట్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఆ తర్వాత ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వద్ద అజయ్‌ అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేశారు. ఇందులో పాయల్‌..కార్తికేయకు జోడీగా నటించారు.

తొలి చిత్రంతోనే మంచి హిట్‌ అందుకున్న ఈ పంజాబీ భామ తానూ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఓ మీడియా సమావేశంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.

‘నేను నటించిన తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఎంతో ఆశపడ్డాను. అనుకున్నట్లుగానే ఓ నిర్మాత నన్ను తన సినిమాలో కథానాయికగా నటించాలని కోరాడు. ఇందుకు నేనూ ఒప్పుకొన్నాను. కానీ కథానాయిక పాత్ర కావాలంటే అతనికి కావాల్సింది ఇవ్వాలని అడిగాడు. రాజీ పడక తప్పదన్నాడు. అది విని నేను అవాక్కయ్యాను. నాకు పాత్ర దక్కకపోయినా ఫర్వాలేదు కానీ ఇలాంటి నీచమైన పనులకు ఒప్పుకోనని కరాఖండిగా చెప్పాను. నేను ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలో ముద్దు సన్నివేశాల్లో నటించాను. నా పాత్రకు ఆ సన్నివేశాల అవసరం ఉంది కాబట్టి చేశాను. కానీ దాని అర్థం అన్నింటికీ రాజీ పడతానని కాదు. కన్పించిన ప్రతీ ఒక్కరికి ముద్దిస్తానని కాదు. నేను చిత్ర పరిశ్రమకు వచ్చింది అలాంటి పనులు చేయడానికి కాదు. నా ప్రతిభను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాను.’ అని వెల్లడించారు పాయల్‌.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: