Hollywood Movie News | Latest Hollywood Cinema News | Hollywood Film News | Hollywood News | All Cinema News | Cinerangam.com

మెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’లో ప్రియాంకా చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ‘అలెక్స్‌ పారిష్‌‌’ పాత్రలో కనిపించి, మెప్పించారు. తన ఉత్తమ నటనకు గానూ ప్రతిష్ఠాత్మకమైన పీపుల్‌ ఛాయిస్‌ అవార్డులు అందుకున్నారు. ఈ సిరీస్‌ ద్వారానే ఆమెకు నటిగా అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. హాలీవుడ్‌ సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. తాజాగా ‘క్వాంటికో’ షూటింగ్‌ పూర్తయిందని ప్రియాంక తెలిపారు. భావోద్వేగంతో ‘అలెక్స్‌ పారిష్‌‌’కు గుడ్‌బై చెప్పారు.

"సీజన్‌ పూర్తయింది. ‘అలెక్స్‌ పారిష్‌’కు గుడ్‌బై‌. ఆమె కథ వృత్తంలా పరిపూర్ణమైంది. ఓ నటికి దక్కే ఉత్తమ అనుభూతి ఇది. అలెక్స్‌ పాత్ర మానసికంగా, శారీరికంగా నాకు సవాలుతో కూడుకున్నది. కానీ మరింత గుర్తింపును ఇచ్చింది. నా కోసం ప్రతి వారం మీ ఇంటిని, హృదయాల్ని ఓపెన్‌ చేసినందుకు ధన్యవాదాలు. నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు, అనుభూతులను మిగిల్చిన అద్భతమైన ‘క్వాంటికో’ బృందానికి ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది" అని ప్రియాంక ట్వీట్లు చేశారు. దీంతోపాటు చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: