Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ‘మాయా’, ‘అరం’, ‘డోరా’ వంటి సినిమాలతో వన్‌మేన్‌ ఆర్మీగా హవా చాటుకుంటున్నారు.తాజాగా ‘కోలమావు కోకిల’లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆమె నటనపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెల్సన్‌ దర్శకత్వంలోని ఈ సినిమాకు హాస్య నటుడు యోగిబాబు అదనపు బలంగా మారారు. ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు తారలు ఈ చిత్రాన్ని తిలకించి మెచ్చుకున్నారు.

కాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజాగా ఈ సినిమాను చూసి చాలా ఎంజాయ్‌ చేసినట్లు దర్శకుడికి చెప్పారు. ‘కడుపుబ్బా నవ్వి ఎంజాయ్‌ చేశా’ అని దర్శకుడికి చెప్పారట రజనీ. సూపర్‌స్టార్‌ ప్రశంసలతో ఉప్పొంగిన నెల్సన్‌ ఆ విషయాన్ని సామాజిక మాధ్యమంలో ప్రస్తావించారు. మరోవైపు కరణ్ జోహార్, శంకర్‌ వంటి అగ్ర దర్శకులు కూడా ఈ సినిమాను చూసి అభినందించారు. అనిరుధ్‌ సంగీతం అద్భుతంగా ఉందని, ‘కన్‌ ఇన్‌ కాదల్‌..’ అనే పాటకు సరైన స్థానాన్ని ఇచ్చారని దర్శకుడు శంకర్‌ ప్రశంసించారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: