కథానాయిక త్రిష తన పదిహేనేళ్ల సినీ ప్రయాణంలో దక్షిణాదిన దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ నటించింది. కానీ రజనీకాంత్ సరసన నటించే అవకాశం రాలేదు. ‘తలైవా పక్కన నటించాలని వుంది. అది నా కల’ అని త్రిష కూడా చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు ఆ కల నిజమైంది. త్రిష తన కెరీర్‌లో తొలిసారి రజనీకాంత్‌తో కలసి నటిస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇందులో త్రిషని కథానాయికగా ఎంచుకున్నారు. ఈ విషయం గురించి చెబుతూ త్రిష ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని తెలియచేసారు.
Coz sometimes you wake up and realise you’re still dreamin 😇❤️ #BestMonday #GODsfavouritechild #mycircleiscompletetoday🙏🏻 https://t.co/HeYpdtHIaV— Trish Krish (@trishtrashers) August 20, 2018
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నారు. ఇటీవలే డార్జిలింగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇంకా ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, బాబి సింహా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సిమ్రాన్ ప్రతినాయకి ఛాయలున్న పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. రజనీకాంత్‌తో కలసి నటించడం సిమ్రాన్‌కి కూడా ఇదే తొలిసారి. సిమ్రాన్‌కి అప్పట్లో 'చంద్రముఖి' చిత్రంలో నటించే అవకాశం వచ్చినా, తన వివాహం కారణంగా అందులో నటించలేదు.
Post A Comment: