కోలీవుడ్‌లో ప్రస్తుతం సీక్వెల్‌ చిత్రాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. 2003లో విడుదలైన ‘సామి’ చిత్రం దాదాపు 15 ఏళ్ల తర్వాత సీక్వెల్‌ సొబగులను అద్దుకుని ‘సామి స్క్వేర్‌’గా వస్తోంది. హరి దర్శకత్వంలోని ఈ చిత్రంలో త్రిషకు బదులుగా ఐశ్వర్యా రాజేష్‌ నటించారు. కీర్తిసురేష్‌ కథనాయిక. బాబిసింహా విలన్‌ పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌లో ఈ సినిమా తొలి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ ట్రైలర్‌ను ఏకంగా 1.5 కోట్ల మంది వీక్షించినా.. ఆశించిన స్థాయిలో విక్రం అభిమానులను అలరించలేదని కోలీవుడ్‌ సమాచారం.

తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘సామి’ సన్నివేశాలు, డైలాగులను గుర్తు చేసేవిధంగా ఈ ట్రైలర్‌ ఉండటం విశేషం. తన పాత్ర పేరైన ‘ఆరుసామి’ని ఠీవీగా చెప్పడం ట్రైలర్‌లో హైలెట్‌గా నిలుస్తోంది. అందులోనూ తొలి భాగంలోని సంగీతాన్ని కూడా దేవిశ్రీ ఇందులో గుర్తుకు తెప్పించారు. 2.08 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో మొత్తం యాక్షన్‌ సన్నివేశాలే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సినిమాను ఈ నెల 20వ తేదీన తెరపైకి తీసుకురానున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. తెలుగు, తమిళంలో ఏకకాలంలో సినిమా తెరపైకి రానుంది.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: