Tamil Movie Gossips | Latest Tamil Cinema Gossips | Kollywood Film Gossips | Kollywood Gossips | All Cinema Gossips | Cinerangam.com

గ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ 1992లో భరతన్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘తేవర్ మగన్’. తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’ పేరుతో అనువదించారు. శివాజీ గణేశన్‌, రేవతి, గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా బాణీలు సమకూర్చారు. కమల్‌ నిర్మాతగా, రచయితగా బాధ్యతలు నిర్వర్తించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఐదు జాతీయ అవార్డులు గెలుచుకుంది. అంతేకాదు 65వ అకాడమీ అవార్డులకు గానూ ఉత్తమ విదేశీ చిత్రంగా భారత్‌ నుంచి ఆస్కార్ అవార్డు కోసం నామినేట్‌‌ అయ్యింది. 1994లో టొరంటో చలన చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు.

ఇప్పుడు ఈ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ చేయాలని కమల్‌ సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు ఆయన ఇప్పటికే పనులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలఫై అధికారిక సమాచారం వెలుబడాల్సి వుంది. కమల్‌ ప్రస్తుతం ‘బిగ్‌బాస్‌’ తమిళ సీజన్‌ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన ‘భారతీయుడు’ సీక్వెల్‌ ‘భారతీయుడు 2’ షూటింగ్‌ ప్రారంభించనున్నారు. మరోపక్క కమల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘శభాష్‌ నాయుడు’ చిత్రం షూటింగ్‌ 40 శాతం పూర్తయింది.

కాగా ఇటీవల కమల్ హాసన్ దర్శకత్వంలో ‘విశ్వరూపం’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ’విశ్వరూపం 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని చవిచూసింది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: