మణిరత్నం దర్శకత్వంలో ‘చెలియా..’ చిత్రం తర్వాత తెరకెక్కిన సినిమా ‘నవాబ్’. తమిళంలో ‘సెక్క చివంద వానం’గా తెరకెక్కుతోంది. అరవింద్‌స్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్, జ్యోతిక, అతిథిరావు, ఐశ్వర్యా రాజేష్, ప్రకాశ్‌రాజ్ వంటి పెద్ద తారాగణంతో ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. భారీ యాక్షన్, కమర్షియల్ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. డాన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కమల్‌హాసన్ నటించిన ‘నాయకుడు’ తరహాలో ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 28వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రారంభంలో ప్రకటించాయి. అయితే ఒకరోజు ముందుగానే 27వ తేదీన చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మణిరత్నం అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మణిరత్నం నిర్మాణంలోని మద్రాస్ టాకీస్, లైకా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.

Post A Comment: