దగ్గుబాటి రానా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో రానా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలో చంద్రబాబుగా రానా లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1984లో చంద్రబాబు లుక్ ఇలా ఉండేది అంటూ రానా ట్విటర్ ద్వారా దీనిని విడుదల చేశారు.
‘యన్.టి.ఆర్’ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. రానా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అబిడ్స్‌లోని ఎన్టీఆర్ నివాసం నుంచే మొదలైంది. ఇందులో అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Post A Comment: