బాలీవుడ్ అగ్ర కథానాయకులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. నవంబర్ 8న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన తారాగణం ఫస్ట్‌లుక్‌లను విడుదల చేశారు. కాగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ విషయాన్ని అమితాబ్, ఆమిర్ ఓ వీడియో ద్వారా తెలిపారు. ‘నేను, ఆమిర్ ఖాన్ కలిసి మొదటిసారి యశ్‌రాజ్ ఫిల్మ్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో మీ ముందుకు వస్తున్నాం. ఈ ప్రత్యేక చిత్రాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఈ దీపావళికి సినిమా హాల్స్‌లో కలుద్దాం’ అంటూ అమితాబ్, ఆమిర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు.
తెలుగు ప్రేక్షకుల్లో అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్ లకు మంచి క్రేజ్ ఉంది. ఆమిర్ ‘దంగల్’ సినిమా తెలుగులోనూ విడుదలై, మంచి విజయం అందుకుంది. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో అమితాబ్ ఆయన గురువు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని అమితాబ్, ఆమిర్ ఓ వీడియో ద్వారా తెలిపారు. ‘నేను, ఆమిర్ ఖాన్ కలిసి మొదటిసారి యశ్‌రాజ్ ఫిల్మ్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో మీ ముందుకు వస్తున్నాం. ఈ ప్రత్యేక చిత్రాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఈ దీపావళికి సినిమా హాల్స్‌లో కలుద్దాం’ అంటూ అమితాబ్, ఆమిర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు.
For the first time @SrBachchan and @aamir_khan are coming together to give you a Diwali Dhamaka. #ThugsOfHindostan releasing on 8th November in Telugu! #KatrinaKaif | @fattysanashaikh | #VijayKrishnaAcharya | @yrf pic.twitter.com/EwXzT30J1t— #ThugsOfHindostan (@TOHTheFilm) September 26, 2018
Post A Comment: