
కన్నడ చిత్రం ‘తాయిగెతక్క మగ’ సినిమాలో గ్లామర్‌గా కనిపించిన నటి ఆశికా రంగనాథ్ 'రంగ మందిర' సినిమాలో కథానాయికగా ఎంపికైంది. శాహురాజ్ శిందె దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతుండగా, బుధవారం నుంచి ఆశికా అభినయ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. 'క్రేజీ బాయ్' సినిమా ద్వారా శాండల్‌వుడ్‌లో ప్రవేశించిన ఆశికా 'మాస్ లీడర్', 'ముగుళునగె', 'రాజు కన్నడ మీడియం', 'తాయిగె తక్క మగ' సినిమాల్లో నటించింది. ఇప్పుడు 'రంగ మందిర'లో అభినయిస్తూ మంచి నటిగా గుర్తింపు పొందాలని తపిస్తోంది. ఇందులో అశుబెద్రె, ప్రవీణ్‌తేజ్ తదితరులు ప్రధానంగా నటిస్తున్నారు. దీన్నొక ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్నారు.
Post A Comment: