ప్రముఖ బుల్లితెర నటుడు కౌశల్‌ను సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’.. ఓవర్‌నైట్ స్టార్‌ను చేసేసింది. ‘బిగ్‌బాస్ సీజన్ 2’ విజేతగా నిలిచిన కౌశల్‌కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయట. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కౌశల్ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. బిగ్‌బాస్ ట్రోఫీ దక్కించుకున్న కౌశల్‌కు ఎందరో సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, రామ్‌చరణ్-బోయపాటి చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేశ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. తూర్పు ఐరోపాలోని పెద్ద దేశంగా ఉన్న అజర్ బైజాన్ లో మంచి లొకేషన్లు ఉన్నాయని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరీస్తోంది చిత్రబృందం.
ఇక ఈ చిత్రానికి రామ్‌చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘స్టేట్ రౌడీ’ పేరును టైటిల్‌గా పరిశీలిస్తున్నారట. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Post A Comment: