విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. కాగా.. ఆయన బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఈ విషయాన్ని క్రిష్ ట్విటర్ వేదికగా ప్రకటిస్తూ తొలి భాగం టైటిల్ పోస్టర్‌ను పంచుకున్నారు. తొలి భాగం సినిమాను ‘యన్‌టిఆర్ కథానాయకుడు’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు. కానీ కథగా మారే నాయకుడొక్కడే ఉంటాడు’ అని వెల్లడిస్తూ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.
తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రెండో భాగానికి ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ అనే టైటిల్‌తో విడుదల చేస్తారని తెలుస్తోంది. తొలి భాగం విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోనే రెండో భాగాన్ని కూడా విడుదల చేస్తారట. విద్యాబాలన్, రానా, సుమంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సావిత్రి పాత్రలో నిత్యమేనన్ నటిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణాజిల్లా దివిసీమలో చిత్రీకరణ జరుగుతోంది. హంసలదీవి సమీపంలో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బుధవారం మొదలైన చిత్రీకరణ శనివారం వరకూ హంసలదీవిలోనే జరగనుంది. మరో రెండు నెలల్లో ఈ చిత్రం టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు.
ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌బికే ఫిలింస్ బ్యానర్‌పై బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..— Krish Jagarlamudi (@DirKrish) October 4, 2018
కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు..
జనవరి 9 న #NTRకథానాయకుడు #NTRKathanayakuduOnJan9 pic.twitter.com/ayrh4i7Gu4
Post A Comment: