అమలాపాల్ ప్రధాన పాత్రలో సెంచురి ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానరుపై జోన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘అదో అంద పరవై పోల’. కేఆర్ వినోద్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం అడ్వెంచర్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. కేరళ, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అరుణ్ రాజగోపాలన్ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చి మాటలు రాస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి అటవీశాఖ అధికారిగా నటించారు. సబీర్‌కొచ్చర్ కీలకపాత్ర పోషించారు.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘గతంలో నా దర్శకత్వంలో వచ్చిన ‘తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తవుం’ మంచి గుర్తింపు సాధించింది. ఇప్పుడు అమలాపాల్‌తో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. యువ పారిశ్రామికవేత్తగా అమలాపాల్ నటించారు. ఆమె ఓ కారడవిలో రైడింగ్‌కు వెళ్లి చిక్కుకుంటారు. అక్కడ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అక్కడి క్రూర మృగాల నుంచి ఆమె ఎలా తప్పించుకున్నారన్నదే చిత్ర కథ. సినిమాలో చాలా వరకు సన్నివేశాలను సింగిల్ షాట్‌లోనే తెరకెక్కించాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. జేక్స్ బిజోయ్ సంగీతం హైలెట్‌గా ఉంటుందని’ పేర్కొన్నారు.
Post A Comment: