ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ‘భైరవగీత’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను నవంబరు 30న విడుదల చేస్తామని చిత్ర బృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని సెన్సార్ సంబంధిత టెక్నికల్ కారణాల వల్ల సినిమా విడుదల ఆగిందని వర్మ తాజాగా ప్రకటించారు. డిసెంబరు 7న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే రోజు తమ సినిమాను విడుదల చేయబోతున్నామని, తప్పకుండా చిత్రానికి ఓటు వేయమని వర్మ కోరారు.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘భైరవగీత’. నూతన దర్శకుడు సిద్ధార్థ ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. కన్నడ నటుడు ధనంజయ కథానాయకుడు. ఇర్రా కథానాయిక. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తోంది. రవి శంకర్ సంగీతం అందించారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
Post A Comment: