సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్లు పనిచేశారు శంకర్. ‘2.ఓ’తో బిజీగా గడిపిన శంకర్.. ప్రస్తుతం తదుపరి తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’పై దృష్టి పెట్టారు. 22 సంవత్సరాల తర్వాత మళ్లీ కమల్‌హాసన్‌తో కలిసి శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఇండియన్ తాత’ సేనాపతి పాత్రను ఇందులో కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి హాలీవుడ్ మేకప్‌మేన్‌లు పలువురు చెన్నైకి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా టెస్ట్ షూట్ కూడా నిర్వహించారు. ఇది శంకర్‌కు అమితంగా నచ్చిందని సమాచారం. మళ్లీ పాత ఉద్వేగంతో ‘ఇండియన్ తాత’ కనిపిస్తున్నారంటూ చిత్ర బృందం చెప్పిందని తెలుస్తోంది.
ఈ సినిమాను కూడా ‘2.ఓ’ లాగా లైకా సంస్థే నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి లొకేషన్లను ఎంపిక చేశారు శంకర్. ఇక డిసెంబరు 14వ తేదీ నుంచి చిత్రీకరణను ప్రారంభించనున్నారు. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కమల్‌హాసన్ ‘బిగ్‌బాస్’ సీజన్ 3ని నిర్వహించనున్నారు. అదే సమయంలోనే రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు. బిగ్‌బాస్ హౌస్, ‘ఇండియన్ 2’కు సంబంధించి సెట్లను పక్కన పక్కనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Post A Comment: