ప్రముఖ నటి అమలా పాల్ రెండో వివాహం చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. తమిళ నటుడు విష్ణు విశాల్‌తో అమలా పాల్ ప్రేమలో ఉన్నారని.. ‘రాక్షసన్’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఓ తమిళ సినిమా వెబ్‌సైట్ వార్త రాసింది. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారని పేర్కొంది. దీనిపై తాజాగా విశాల్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ సదరు వెబ్‌సైట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది స్టుపిడ్ వార్త. బాధ్యతగా వ్యవహరించండి. మనం మనుషులం. మనకూ కుటుంబాలు ఉంటాయి. ఏదో ఒక వార్త కావాలని కదా అని ఇష్టం వచ్చినట్లు ఏదిపడితే అది రాసేయకండి’ అని ట్విటర్ ద్వారా మండిపడ్డారు.
కొన్ని నెలల క్రితమే విశాల్ తన భార్య రజనీతో విడిపోయానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. మరోపక్క అమలా పాల్ ఏడాది క్రితం ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్ విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
Wat a stupid news..plz b responsible ..we r humans too n v hav lives n family..just dnt write anything for d sake of it..🙏 https://t.co/DL88C1goVn— VISHNUU VISHAL - VV (@vishnuuvishal) November 27, 2018
Post A Comment: