ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న స్టార్‌డమ్ మరోసారి నిరూపితమైంది. తలైవా స్టైల్, శంకర్ విజన్ కలగలిపి వచ్చిన ‘2.0’ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. ‘‘2.0’ చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసింది. ఇది కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు.. మెగా బ్లాక్‌బస్టర్’ అంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఆనందంతో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా చిన్ని 3.ఓ ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.
History in the making! 400 CRORES WORLDWIDE! Not just a blockbuster, it's a MEGA BLOCKBUSTER! 🎉🎊#2Point0MegaBlockbuster #2Point0 @rajinikanth @akshaykumar @shankarshanmugh @iamAmyJackson @arrahman pic.twitter.com/er1yxuo95N— Lyca Productions (@LycaProductions) December 3, 2018
‘2.0’ హిందీ వెర్షన్‌లో ఆదివారానికి రూ.95 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. తొలిరోజుతో పోల్చితే నాలుగో రోజు వసూళ్లు 41.67 శాతం పెరిగాయని అన్నారు. ఈ సినిమా గురువారం (విడుదల రోజు) రూ.19.50 కోట్లు, శుక్రవారం రూ.17.50 కోట్లు, శనివారం రూ.24 కోట్లు, ఆదివారం 34 కోట్లు మొత్తం రూ.95 కోట్లు (హిందీ) సాధించినట్లు తెలిపారు.
2010లో వచ్చిన సూపర్‌హిట్ ‘రోబో’ సీక్వెల్ ‘2.0’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అమీ జాక్సన్ కథానాయిక. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమాను నిర్మించింది.
Post A Comment: