Hollywood Movie News | Latest Hollywood Cinema News | Hollywood Film News | Hollywood News | All Cinema News | Cinerangam.com

ట్టకేలకు సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్‌4’ ట్రైలర్‌ వచ్చేసింది. అంతేకాదు, సినిమా టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ అనే టైటిల్‌ను పెట్టారు. ముందస్తు సమాచారం లేకుండా మార్వెల్‌ ఈ ట్రైలర్‌ను విడుదల చేసి ‘అవెంజర్స్‌’ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’ చివరిలో పలువురు అవెంజర్స్‌ మాయమవుతూ కనిపించారు. అసలు వాళ్లెక్కడికి వెళ్లారు? బతికే ఉన్నారా? ప్రపంచాన్ని నాశనం చేసి, తన సామ్రాజాన్ని సృష్టించాలనుకున్న థానోస్‌ ఏం చేయబోతున్నాడు? అతన్ని అవెంజర్స్‌ ఎలా మట్టుబెట్టబోతున్నారు? వంటి ప్రశ్నలకు ఇందులో సమాధానం లభించనుంది.

‘హే పెప్పా.. నీకీ రికార్డింగ్‌ అందే సమయానికి నేను ఎక్కడ ఉంటానో తెలియదు. ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. స్పేస్‌లో కొట్టుకుపోతూ ఎవరైనా రక్షిస్తారనే ఆశతో స్పేస్‌లోనే చావడం నా అదృష్టం అనుకోవాలి. నిజానికి నాలుగు రోజుల క్రితమే ఆహారం నీళ్లు అయిపోయాయి. రేపటికల్లా ఆక్సిజన్‌ కూడా అయిపోయింది. చావు బతుకుల మధ్యే ఉన్నా నీ పేరే కలవరిస్తున్నా.. నీ గురించే ఆలోచిస్తున్నా’ అంటూ ఐరన్‌మ్యాన్‌ టోనీ స్టార్క్‌ సంభాషణతో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది.


‘థానోస్‌ అన్నంత పనీ చేశాడు. 50శాతం ప్రాణులను తుడిచిపెట్టేశాడు’ అని బ్లాక్‌ విడో అంటే ‘మనం గెలుస్తాం! అది పనిచేయకపోతే ఏం చేయాలో తెలియదు.’ అని కెప్టెన్‌ అమెరికా చెప్పడం, బయట నుంచి యాంట్‌మ్యాన్‌ వారిని పిలవడంతో ట్రైలర్‌ ముగిసింది. ఆంటోని రుస్సో, జాయ్‌ రుస్సోలు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కాగా...ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 28కోట్లకు పైగా వ్యూస్ సాధించి చరిత్రలోనే అత్యధికమంది వీక్షించిన ట్రైలర్‌గా నిలిచినట్లు మార్వెల్ స్టూడియోస్ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: