Antariksham Trailer | Varun Tej Antariksham Movie Trailer | Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

లంతర్గామి నేపథ్యంలో ‘ఘాజీ’ని తెరకెక్కించిన సంకల్ప్‌రెడ్డి ఈ సారి అంతరిక్షం, స్పేస్‌ సెంటర్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘అంతరిక్షం: 9000 kmph’. వరుణ్‌తేజ్‌, అదితీరావ్‌ హైదరీ కీలకపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారు. ‘ప్రపంచం మొత్తం కమ్యునికేషన్‌ బ్లాక్‌ అవుట్‌ అయ్యే అవకాశం ఉంది’ అని ఓ వ్యక్తి అంటే.. ‘దయచేసి ఒక్క శుభవార్త చెప్పు భాను..’ అని మరొకరు ఆయన్ను అడిగారు. ‘ఒకటి ఉంది సర్‌.. దేవ్‌.. పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎన్నో శాటిలైట్స్‌కు సక్సెస్‌ఫుల్‌గా కోడింగ్‌ చేశాడు’ అంటూ వరుణ్‌తేజ్‌ను పరిచయం చేశారు. సస్పెన్స్‌తోపాటు ప్రేమకథను కూడా ఇందులో చూపించారు. ‘ఈ శాటిలైట్‌ ఓ సోల్జర్‌ లాంటిది. ఫైయిల్‌ అయితే ఎలా అని అడగకూడదు. గెలవాలంటే ఏం చేయాలి అని మాత్రమే ఆలోచించాలి’ అని హీరో చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.


ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వై.రాజివ్‌రెడ్డి, కె.సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. డిసెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: