Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవిత ఆధారంగా పలు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ కూడా బయోపిక్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన దాదాపు తొమ్మిది నెలలపాటు పరిశోధనలు చేశారు. ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేశామని జయలలిత జయంతి సందర్భంగా చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. సినిమాకు ‘తలైవి’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా టైటిల్‌ లోగోను విడుదల చేసింది. విష్ణు వర్ధన్‌ ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించనున్నారు. నీరవ్‌ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయబోతున్నారు.

మరోపక్క జయలలిత బయోపిక్‌గా నిత్యా మేనన్‌ టైటిల్‌ రోల్‌లో ‘ఐరన్‌ లేడీ’ అనే సినిమాను తీస్తున్నారు. దీనికి ప్రియదర్శిణి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. ఇటీవల ఈ సినిమాలో నిత్య లుక్‌ను తెలుపుతూ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జయలలిత నిచ్చెలి శశికళ పాత్రను నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పోషించనున్నారని తెలిసింది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: