కొంత విరామం తర్వాత హీరో సాయి రామ్ శంకర్ చేస్తున్న సినిమా 'రీసౌండ్'. సోమవారం సాయిరాం శంకర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని మరియు బాబీ రీసౌండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సాయి రామ్ శంకర్ స్టైలిష్‌గా పొగ తాగుతూ పోలీస్ స్టేషన్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంతకు ముందు పోలీసులతో ఘర్షన జరిగినట్లు తెలుస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ ఎలా ఉండబోతుందో ఈ పోస్టర్ సూచిస్తోంది
సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ మురళి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జె సురేష్ రెడ్డి, బి అయ్యప్ప రాజు మయు ఎన్.వి.ఎన్ రాజ రెడ్డి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.
Post A Comment: